దీనిపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విపక్షంలోని డెమోక్రాట్లు కూడా ఓ మంచి బిల్లును గుర్తించడం లేదని అరోపించారు. ఈ చర్య వల్ల ఒబామా కేర్ కొనసాగనుందని, ఒక్కసారిగా ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు పెరగనున్నాయని అన్నారు. ప్రస్తుతం తాను చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించిన ఆయన, దేశానికి చెడు పరిణామాలు సంభవించనున్నాయని హెచ్చరించారు.
గత 18 నెలలుగా ఒబామా కేర్‌ను తాను వ్యతిరేకిస్తూనే ఉన్నానని గుర్తు చేసిన ఆయన, ఈ పథకం కొనసాగితే పరిస్థితి దిగజారుతుందని అన్నారు. పాలసీ ప్రీమియంలు భారీగా పెరిగి, ప్రజలు ఈ బీమాను ఉపయోగించుకోలేని దుస్థితి రానుందని ఆయన వ్యాఖ్యానించారు.