నేపాల్‌లో భూకంపం : పాట్నాలో భూప్రకంపనలు...

ఠాగూర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (08:20 IST)
నేపాల్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని సింధూపాల్ చౌక్ జిల్లాలో గుర్తించారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధనా కేంద్రం తన వెబ్‌‍సైట్‌లో సింధూపాల్ చౌక్ జిల్లాలోని బైరవ్‌కుండలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2.51 గంటలకు భూకంప కంద్రాన్ని గుర్తించిటన్టు పేర్కొంది. 
 
ఈ భూకంపం కారణంగా నేపాల్‌లోని అనేక ప్రాంతాలలో ప్రధానంగా తూర్పు, మధ్య ప్రాంతాలలోని ప్రజల భూప్రకంపనలకు లోనైనట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్థానిక అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అటు భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. 
 
భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును చెత్త కుప్పలో పడేసిన భర్త! 
 
తాను ఎంతో ఇష్టపడి రూ.27 లక్షలు వెచ్చించి అందమైన కారును ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారు ఆయన భార్యకు నచ్చలేదు. అంతే.. మరోక్షణం ఆలోచన చేయకుండా ఆ కారును చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
 
రష్యా రాజధాని మాస్కో నగర సమీపంలోని మైటిష్బ్‌ అనే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తమ తమ వైవాహి బంధంలో అపుడపుడూ తలెత్తే చిన్నపాటి తాగాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులోభాగంగా, ప్రేమికుల రోజున తన భార్యకు ఖరీదైన ఎస్‌యూవీ కారు ధర సుమారు రూ.27 లక్షలు వెచ్చించి కారును కొనుగోలు చేశాడు. 
 
అయితే, ఆ కారును కొనుగోలుకు ముందే కొన్ని ప్రాంతాల్లో డ్యామేజీ అయింది. దీంతో  ఆ కారును భార్య తిరస్కరించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ భర్త చెత్త కంటైనర్‌లో ఆ కారును పడేశాడు. ఇది అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు రెండు వారాలుగా ఆ కారు అక్కడే ఉండిపోయింది. 
 
ఇదిలావుంటే, చెత్త కంటైనర్‌పై ఉన్న కారుతో ఫోటోలు దిగేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు సైతం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఇపుడు టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. అయితే, దాన్ని ఆ కారును అక్కడ నుంచి తొలగించేందుకు అధికారులు సైతం ప్రయత్నించకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు