పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన

సోమవారం, 20 మార్చి 2017 (14:34 IST)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు కొత్త వెసులుబాటు కల్పించింది. ఇతర వర్గాల మాదిరి తమ దేశంలో నివసిస్తున్న హిందువులు తమ సంప్రదాయం ప్రకారం జరుపుకునేందుకు వీలుగా ఉద్దేశించిన హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత కల్పించారు. ఇందుకు అధ్యక్షుడు మమ్మున్ హుసేన్ ఆమోదముద్ర కూడా వేశారు.
 
తద్వారా మైనారిటీ హిందువుల వివాహాల విషయంలో వ్యక్తిగత హక్కులు లభించినట్లైంది. తమ దేశంలో ఉంటున్న మైనారిటీలు కూడా దేశభక్తులేనని.. వారిని కూడా ఇతర వర్గాలతో సమానంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సూచన మేరకు ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేసినట్లు పాక్ పీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి