తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. అమెరికాలోని స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో టర్మినల్స్‌లోని కొంతమంది ప్రయాణీకులు పరుగులు పెడుతుండగా మరికొందరు ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలిస్తున్నారు.