చికెన్ కూర వండలేదని.. భార్య గొంతుకోసిన భర్త.. ఎక్కడ?

శుక్రవారం, 18 నవంబరు 2016 (13:10 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై గృహ హింసల నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే మహిళలపై దాడులు, హత్యలు జరిగిపోతున్నాయి. తాజాగా చికెన్ వండటం ఆలస్యమైందని ఓ భర్త భార్య గొంతు కోసేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  శివమొగ్గ నగరంలో సురేష్, ఆశారాణి(33) దంపతులు నివాసముంటున్నారు. 
 
మద్యానికి బానిసైన ఆశారాణి భర్త సోమవారం చికెన్ తీసుకుని వచ్చి వండమని భార్యకు చెప్పాడు. అప్పటికే సురేష్ మద్యం మత్తులో ఉన్నాడు. తిరిగి వచ్చి చూసేసరికి చికెన్ వండడం లేటు అయ్యింది. అంతే కోపంతో ఊగిపోయిన అతడు భార్య గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆశారాణి చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని సురేష్‌ను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి