ఈ నెంబరును తొలిసారిగా మొబిటెల్ సంస్థ సీఈవో వ్లాదిమిర్ గ్రాస్నవ్ వాడారు. 2001లో ఆయన కేన్సర్‌తో ప్రాణాలు చనిపోయారు. అయితే ఆయన చనిపోయిన కారణం వేరే ఉందని, బిజినెస్‌లో కలహాలు, హానికారక రేడియో యాక్టివ్ పాయిజనింగ్ వల్లే ఆయన మృత్యువాత పడ్డారని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆ తర్వాత ఈ నంబరును కాన్‌స్టాంటిన్ డిమిట్రోవ్ అనే మాఫియా డాన్ వినియోగించాడు. ఆయన కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హతమయ్యాడు. ఆ తర్వాత ఆ ఫ్యాన్సీ నెంబరు 2005లో దిష్‌లీవ్ అనే బిజినెస్ మేన్ చేతికి వెళ్లింది. అదే సంవత్సరంలో బల్గేరియా రాజధాని సోఫియాలో ఆయనను పలువురు హత్య చేశారు. ఆ తర్వాత సదరు కంపెనీ ఆ నంబరును బ్లాక్ చేసింది.