నాసా ఇన్‌సైట్ (ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్‌పోర్ట్) మిషన్ వీళ్లను మార్స్‌పైకి తీసుకెళ్లనుంది. 2018, మే 5వ తేదీన ఈ మిషన్ లాంచ్ కానున్నది. అయితే వీళ్లంతా నేరుగా మార్స్‌పైకి వెళ్లడం లేదు. ఈ 24 లక్షల మంది పేర్లను ఓ చిన్న సిలికాన్ వేఫర్ మైక్రోచిప్‌లో ఇన్‌సర్ట్ చేసి.. ఆ చిప్‌ను ల్యాండర్‌కు అటాచ్ చేయనున్నారు. ఇందుకోసం భారత తరపున లక్షకుపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు నాసా వెల్లడించింది.
ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ మూడోస్థానంలో నిలవడం విశేషం. తొలిస్థానంలో 6,76,773 మందితో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. 2,62,752 మందితో చైనా రెండోస్థానంలో ఉంది. అమెరికా విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా భారత్ నుంచి ఇంత మంది తమ పేర్లు నమోదు చేసుకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇస్రో తమ మంగళ్‌యాన్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో భారతీయుల్లో మార్స్‌పై అవగాహన పెరిగింది. నాసా ఇన్‌సైట్ మిషన్ మొత్తం 720 రోజులు సాగనుంది.