దీంతో భారత్‌లో భారత్‌లో చైనా ఉత్పత్తులను కొనకూడదని పిలుపునిస్తారని.. అయితే వాళ్లనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరదని సదరు పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం చైనాతో భారత్‌కున్న వ్యాపార బంధాలపైనా ఈ ఉద్యమం ప్రభావం చూపలేదని చెప్పింది. అయితే ఈ అంశాలపై భారత్, చైనా చర్చిస్తున్నాయని.. త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశముందని పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో భారత రేడియో, టీవీ ప్రసారాలపై నిషేధం శుక్రవారం నుంచి అమలు కానుంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రసారాలు నిలిపివేయనున్నట్లు పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ ప్రాధికార సంస్థ (పెమ్రా) ప్రతినిధులు తెలిపారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన క్రమంలో ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ చర్య పట్ల కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.