యూరీ ఘటన అనంతరం మాటల్లో కాదని.. చేతల్లో చూపిస్తామని చెప్పి రక్షణమంత్రి మనోహర్ పారీకర్ చెప్పినట్లే చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సైన్యాన్ని దింపారు. 37 మంది ఉగ్రమూకలను ఏరిపారేశారు. ఈ నేపథ్యంలో భారత సైనికులు చేపట్టిన సర్జికల్ స్త్రయిక్ తర్వాత కూడా పాకిస్థాన్ అనస్తీషియా (మత్తుమందు ఇచ్చిన రోగి)లోనే ఉందని రక్షణమంత్రి మనోహర్ పారీకర్ అన్నారు.
ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌చంద్రసింగ్ గర్వాలీ స్వగ్రామంల ఆయ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా పారికర్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత దాడి చేసిన రెండు రోజుల తర్వాత కూడా ఏం జరిగిందో అర్ధం కాని నిర్వేదంలో పాక్ ఉందన్నారు. భారత సైన్యం హనుమంతుడి మాదిరిగా పరాక్రమించిందని కొనియాడారు.
మహారాష్ట్రకు చెందిన చౌహాన్‌ను సరిహద్దు దాటిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాక్ చౌహాన్ తమ దగ్గరే ఉన్నట్లు ప్రకటించింది. పాక్ మీడియా చౌహాన్ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రసారం చేసింది. చౌహాన్ క్షేమంగా తిరిగిరావాలని దేశమంతా ఆకాంక్షిస్తోంది. అయితే పాక్ మాత్రం చౌహాన్‌ను బంధించి కొత్త నాటకానికి తెరలేపుతోందని జాతీయ మీడియా ప్రసారం చేస్తోంది.