కాశ్మీర్‌లోని అక్నూర్, ఉరి దాడులతో పాకిస్థానీ ముజాహిదీన్ కమాండర్లు భారత్‌కు ధీటైన జవాబిచ్చారంటూ శుక్రవారం ప్రకటించిన సయూద్... తాజాగా సింధూ జలాల ఒప్పందంపైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. లాహోర్‌కి 130 కిలోమీటర్ల దూరంలో ఫైసలాబాద్‌లో జరిగిన కాశ్మీరీ కాన్ఫరెన్స్ ర్యాలీలో సయూద్ ప్రసంగిస్తూ సింధూ జలాల ఒప్పందాన్ని ప్రస్తావించారు.
పాకిస్థాన్‌కు నదీ జలాలను భారత్ నిలిపివేస్తే నదుల్లో రక్తం పారుతుందంటూ హెచ్చరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉరి సైనికశిబిరంపై దాడులు జరిపిన అనంతరం సింధూ జలాల ఒప్పందంపై పున:పరిశీలన జరపాలని, సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు చట్టబద్ధంగా భారత్‌కే చెందినవని, వ్యర్థ జలాలను పాకిస్థాన్‌కు వదలకుండా నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది నవంబర్ 25న హెచ్చరించారు. దీంతో పాక్ వెన్నులో వణుకు పుట్టింది.