బంగారు నగలకు బదులు టమోటాలు ధరించిన వధువు

బుధవారం, 20 నవంబరు 2019 (14:42 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఓ వధువు బంగారు నగలకు బదులు టమోటాలను ధరించింది. పాకిస్థాన్‌లో టమోటాల దిగుమతికి నిషేధం విధించిన నేపథ్యంలో.. టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఫలితంగా రూ.300లకు కేజీ టమోటాలను అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, టమోటా ధరలకు రెక్కలు వచ్చిన నేపథ్యంలో, ఆ దేశానికి చెందిన ఓ యువతి తన వివాహానికి టమోటాలనే ఆభరణాలుగా ధరించింది. మెడలో, చేతుల్లో టమోటాలను ధరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా వధువు టమోటాలను ఆభరణాలుగా ధరించిన వధువును ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఓ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 
 
ఇంకా ఆ వధువుకు చుట్టుపక్కల వారు గంపెడు టమోటాలను కానుకగా ఇచ్చారు. ఇంటర్వ్యూలో వధువు మాట్లాడుతూ.. పసిడి ధరలు పెరిగాయి. వాటికి సమానంగా టమోటా ధరలు కూడా పెరిగాయి. అందుకే బంగారుకు బదులు టమోటాలను ధరించినట్లు చెప్పింది.

Tomato jewellery. In case you thought you've seen everything in life.. pic.twitter.com/O9t6dds8ZO

— Naila Inayat नायला इनायत (@nailainayat) November 18, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు