కాంద‌హార్ కాల్పుల్లో మ‌ర‌ణించిన ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ

శనివారం, 17 జులై 2021 (11:11 IST)
జ‌ర్న‌లిస్టులు ఒక్కోసారి త‌మ ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి వార్త‌ల‌ను సేక‌రిస్తారు. పూలిజ్జ‌ర్ అవార్డు గ్ర‌హీత ద‌నిష్ సిద్ధిఖీ కూడా ఇలానే చేశాడు. రాయ‌ట‌ర్స్‌కు చెందిన జ‌ర్న‌లిస్ట్ ఆఫ్గాన్ ప్ర‌త్యేక బ‌ల‌గాల‌తో క‌లిసి తాలిబాన్ స్థావరాల‌పై దాడి క‌వ‌రేజ్‌కి వెళ్ళాడు.

అక్క‌డ వార్ రిపోర్టింగ్ చేస్తూ, ఉగ్ర‌వాదుల కాల్పుల్లో కుప్ప‌కూలాడు. ఆఫ్గ‌నిస్థాన్ అంబాసిడ‌ర్ ఫ‌రీద్ ఈ మ‌ర‌ణ వార్త‌ను ట్వీట్ చేశాడు. ఓ జ‌ర్న‌లిస్ట్ స్నేహితుడిని కోల్పోయినందుకు తీవ్రంగా చ‌లించిపోయాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు. ఇండియ‌న్ ఎంబ‌సీ కూడా ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ మ‌ర‌ణ వార్త‌ను ధృవీక‌రించింది. 
 
ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ ఆఖ‌రుగా మూడు రోజుల క్రితం తాలిబాన్ల దాడి విజువ‌ల్స్ కూడా చిత్రీక‌రించి త‌మ వార్తా సంస్థ‌కు రిపోర్ట్ చేశాడు. మాకు ఇంకా ముఖ్య విష‌యాలు, ఫోటోలు అర్జంట్ గా కావాల‌ని రాయిట‌ర్స్ ఎడిట‌ర్ ఇన్ ఛీఫ్ అలెస్సాండ్రా గ‌ల్లోనీ ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ కి మెసెజ్ కూడా పంపారు. ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ అత్యుత్త‌మ జ‌ర్న‌లిస్ట్ అని, ప‌నిలో ఏకాగ్ర‌త క‌లిగిన మంచి కొలీగ్ అని ఇపుడు పొగుడుతున్నారు.

ఈ బాధాక‌ర‌మైన స‌మ‌యంలో ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ కుటుంబం ఎలా ఈ సంఘ‌ట‌న‌ను త‌ట్టుకుంటుందో అని ఎడిటోరియ‌ల్ బృందం త‌మ విచారాన్ని వ్య‌క్తం చేస్తోంది. అంత‌కు ముందే త‌న చేతికి గాయాల‌య్యాయ‌ని, అయినా తాలిబాన్ల సైన్యం తిరిగి విజృంభించే యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నాన‌ని ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ తెలిపాడు. వెన‌క ద‌ట్ట‌మైన కాల్పుల పొగ వ‌స్తుండ‌గా, నిరాశ్ర‌యురాలైన ఒక మ‌హిళ ఫోటో తీస్తున్నాన‌ని చెప్పిన ఫోటో జ‌ర్న‌లిస్ట్ సిద్ధిఖీ ... ఆ త‌ర్వాత తాలిబాన్ల కాల్పుల్లో అశువులు బాసాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు