అయితే విద్యార్థులు పడే బాధకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే పాఠశాలల్లో ఆటపాటలకు ఏ విధంగా సమయాన్ని కేటాయిస్తారో అలాగే.. విద్యార్థులు నిద్రపోయేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. దీని వల్ల పిల్లల ఆరోగ్యంతో పాటు.. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
జపాన్‌లోని కకొగ్వా పట్టణంలో ఉన్న జూనియర్ హైస్కూల్ యాజమాన్యం ఇటీవల విద్యార్థులతో సమావేశం ఏర్పాటుచేసి వారి నుంచి సలహాలు.. సూచనలు స్వీకరించింది. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం.. గ్లోబల్ వార్మింగ్.. విద్యుత్ ఆదా వంటి అంశాలకు సంబంధించి చక్కటి పరిష్కారం సూచించారు. మధ్యాహ్నం పూట కొంతసమయం విద్యార్థులు నిద్రపోయేందుకు అనుమతించి.. స్కూల్‌లో అన్ని లైట్లు.. ఫ్యాన్లు ఆపేయాలని కోరారు.
దీనిద్వారా విద్యుత్ ఆదాతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని వెల్లడించారు. రెండు వారాల పాటు నిర్వహించే ఈ పనిలో ట్రయల్‌రన్‌లో విద్యార్థుల్లో మార్పులు కనిపిస్తే తమ నిర్ణయాన్ని శాశ్వతంగా అమలు చేయాలని చూస్తోంది. అంతేకాదు.. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి హ్యాట్సాఫ్ కొట్టాలి గురూ..!