చిన్న పామును పెద్దపాము మింగేయడం, చిన్న చేపను పెద్దచేప గుటుక్కుమనిపించడం ప్రకృతి సహజం. గుడ్లను పొదుగుతున్న పక్షులు, పాములు గుడ్లనుంచి పిల్లలు బయటకు రాగానే విపరీతమైన ఆకలికి తట్టుకోలేక తాము పొదిగిన పిల్లల్నే నమిలేయడం కూడా తెలుసు. మరీ ముఖ్యంగా పాములు ఆహారంకోసం కప్పలను, ఇతర చిన్న జీవులను మింగడం మనకు తెలుసు. కానీ ఒక పెద్ద పాము మరో పెద్ద పామును అమాంతంగా మింగేస్తే ఏమవుతుంది. ఏమీకాదు మింగబడిన పామును మింగిన పాము మళ్లీ కక్కేస్తుంది. అది బతికే ఉంటుంది కూడా.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అయితే పాము మింగిన పాము మళ్లీ బతికి ఎలా బయటకు వచ్చింది అన్నదే సందేహం కదూ.. పాము తన శక్తికి మించిన పని చేస్తే ఇలాగే కక్కేస్తుంటుంది. చిన్న చిన్న జీవులను అమాంతం నోట్లో వేసుకుని చప్పరించే పాము తన కడుపు పరిమాణానికి పెద్దదిగా ఉండే జీవులను, తింటే మాత్రం అది అరిగించుకునే చాన్స్ లేక, కడుపులో పెట్టుకునే అవకాశమే లేక తిన్నదాన్ని మళ్లీ కక్కేస్తుంటుంది.