సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకరు లేరు. గతకొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన పరిస్థితి చాలా క్షీణించింది.
ప్రభువులు సిరిరాజ్ హాస్పిటల్‌లో (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 3.30 గంటలకు ప్రశాంతంగా కన్నుమూశారు అని రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుగుబాట్లు, రాజకీయ సంక్షోభాల యుగంలో థాయ్ రాజు సుస్థిరత కోసం కృషిచేసి ప్రజల మన్ననలు పొందారు. 1946 నుంచి సింహాసనంపై కొనసాగుతున్న రాజు భూమిబోల్ వారసునిగా యువరాజు మహావజ్ర లొంకర్న్ రాజదండాన్ని స్వీకరిస్త్తారు.