భూటాన్ యువరాజు పేరు జిగ్మి జితెన్ వాంగ్‌చుక్. వయస్సు మూడేళ్లు. ఈ బుడతడు 824 సంవత్సరాల తర్వాత పునర్జన్మ ఎత్తినట్టు చెపుతున్నాడు. పైగా.. బీహార్‌లోని నలందలో విద్యాభ్యాసం చేశాడు. నాటి భవన సముదాయాలు పూర్తిగా ధ్వంసమైపోయినట్టు ఈ యువరాజు చెపుతున్నాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం బీహార్ పర్యటనకు వచ్చిన భూటాన్ రాజమాత దోజీ వాంగ్‌చుక్ చెప్పుకొచ్చింది.
తన మనవడితో కలసి భారత పర్యటనకు వచ్చిన ఆమె, నలంద ప్రాంతంలో మనవడు చెబుతున్న వందల ఏళ్ల నాటి సంగతులను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాలను విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుండగా, ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాను 824 ఏళ్ల తర్వాత పునర్జన్మ పొందానని, గతంలో ఇక్కడే చదువుకున్నానని చెబుతూ, అక్కడి భోజనశాల, తరగతులు, హాస్టల్ ఎక్కడున్నాయో చూపుతున్నాడీ బుడతడు. వాళ్లమ్మతో భారత పర్యటనకు వచ్చి తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటున్న ఈ చిన్నారిని చూస్తే నిజమే అనిపించక మానదు.