ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)పై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. ఆప్ఘనిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబును ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా పిలుస్తారు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ అణు రహిత బాంబును ప్రయోగించింది. ఐఎస్ టెర్రరిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే తూర్పు ఆప్ఘానిస్థాన్‌లోని నంగర్హార్‌లో ఈ బాంబును జార విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం వెల్లడించింది.
ఎంసీ-130 అనే విమానం నుంచి జీబీయూ-43 అనే ఈ బాంబును అమెరికా ప్రయోగించింది. నంగర్హార్ ప్రావిన్స్‌లోని అచిన్ జిల్లాలో ఉన్న ఐసిస్ ‘‘టన్నెల్ కాంప్లెక్స్’’పై జీబీయూ-43/బీ బాంబును అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా బలగాలు ప్రయోగించాయి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:32 గంటలకు ఈ దాడి జరిగింది. 21,600 పౌండ్లు (9797 కిలోలు) బరువుండే ఈ భారీ బాంబును అన్ని బాంబులకు తల్లిగా పిలుస్తారు.