తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానని తెలిపారు. భారత్, యూఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధినేతల స్వరాల్లో మార్పు చాలా కీలకంగా మారింది. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు.
ఇండియా, అమెరికాల మధ్య ఎటువంటి ఇబ్బంది ఉండదని.. భవిష్యత్తులో కూడా రాకుండా చూసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ప్రధాన మంత్రి మోదీతో వాణిజ్య చర్చలు జరుపుతానని చెప్తూనే.. వాణిజ్య చర్చలు జరుపుతానని మరోవైపు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరో సంచలన నిర్ణయానికి తెరలేపారు.
భారత్‌తో పాటు చైనాపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసే వరకు ఈ రెండు దేశాలపై 100 శాతం సుంకాలు కొనసాగించాలని రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే అంశంపై అమెరికా, ఈయూకు చెందిన సీనియర్ అధికారులు వాషింగ్టన్‌లో సమావేశమైన భేటీలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.