బ్రిటన్ యువరాజు హ్యారీని పెళ్లాడిన హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ యువరాణి అయ్యింది. యువరాణి అయినప్పటికీ ఆ స్థాయిలోనే రూల్స్ వుంటాయి. మునుపటిలా ఆమె జీవితాన్ని గడపలేరు. యువరాణిగా ఆమెకు సకల సౌకర్యాలు లభించటంతో పాటు రాజ వంశీకులుగా కొన్ని ఆంక్షలు కూడా వర్తిస్తాయి. ఆ రూల్స్ ప్రకారం సెల్ఫీలు తీసుకోవడం, ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం చేయకూడదు.
కాగా బ్రిటన్ యువరాజు హ్యారీ(33), హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్(36) వివాహం శనివారం (మే-20) అంగరంగ వైభవంగా జరిగింది. విండర్స్ క్యాజిల్‌లో జరిగిన ఈ రాజ కుటుంబ వేడుకలో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 హాజరయ్యారు.
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్ నటుడు జార్జి క్లూనీ, సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్ ప్లాటినం ఉంగరం తొడిగారు.