అతిథిదేవో భవ అంటారు పెద్దలు. సాధారణంగా ఇంటికి అతిథులు వస్తే.. వారికి గౌరవం ఇవ్వడం మనదేశ సంస్కృతి. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడంలో భారతీయులదే అగ్రస్థానం. అదే అతిథులు ఇంటికొచ్చి వెళ్ళిపోతే.. మరిన్ని రోజులు ఉండమని అడుగుతాం. కానీ అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. చుట్టాలను తరిమికొట్టేందుకు ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపింది. ఫ్లోరిడాలోని పనామా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అంతే తాగిన మత్తుతో పాటు కోపంతో రగిలిపోయిన సావెల్ తనవద్ద ఉన్న తుపాకీతో అతిథులపై కాల్పులు జరిపింది. అంతే సావెల్ చర్యతో చుట్టాలు పారిపోయారు. ఈ క్రమంలో సావెల్ ప్రియుడిపైన కూడా కాల్పులకు పాల్పడింది. అయితే పోలీసులు సావెల్‌ను అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటనలో ఎవరికీ ప్రాణహానీ జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ గాయపడిన వారు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.