థాయ్‌లాండ్ దేశానికి చెందిన లేడీ యూట్యూబర్ ఒకరు ఏకంగా రూ.437 కోట్లకు టోకరా వేశారు. డ్యాన్స్ వీడియోలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె.. ఫారెక్స్ ట్రేడింగ్ వీడియోలతో మంచి ఫాలోయర్లను సంపాదించుకుంది. దీంతో ఆమె మాటలు నమ్మి ఏకంగా 6 వేల మంది ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు. అలా ఏకంగా రూ.437 కోట్లకు ఆమె టోకరా వేశారు. ఈమె పేరు నథామోన్ ఖోంగ్చాక్. ఈమె అందరికీ నట్టీగా సుపరిచితురాలు.
ఈ అందాల భామకు యూట్యూబ్‌లో 8.47 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నట్టి తన డ్యాన్స్ వీడియోలతో అందరినీ ఆలరిస్తుంటుంది. మఖ్యంగా, విదేశీ మారకద్రవ్యం నేపథ్యంలో అధిక లాభాలు అర్జించడం ఎలాగో ఆశావహులకు ప్రైవేటుగా అహగాన కల్పిస్తుంది. ఈ మేరకు తనకు ఫారెక్స్ ట్రేడింగ్‌లో వచ్చిన లాభాలు అంటూ ఇన్‌స్టా ఖాతాలో పలు పోస్టులు పెట్టింది. దీంతో ఆమె మాటలు నమ్మిన అనేక మంది ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారు.
ఎంత పెట్టుబడి పెడితే అంతకు 35 శాతం అధిక లాభాలతో తిరిగి ఇస్తానంటూ ప్రచారం చేసింది. దీంతో దాదాపు ఆరు వేలకు పైగా నెటిజన్లు పెట్టుబడులు పెట్టింది. అయితే, ఎంతకీ ఒక్కపైసా తిరిగి రాకపోవడంతో తాము మోసపోయినట్టు నట్టి ఫాలోయర్లకు అర్థమైంద. ఆ విధంగా రూ.437 కోట్లకు టోపీ వేసిందని గుర్తించారు. నట్టి చేసిన మోసంపై థాయ్ పోలీసులకు ఏకంగా 102 మంది ఫిర్యాదు చేశారు. దీంతో నట్టికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ అయింది.