అమెరికా సైన్యంలో ఆత్మహత్యలు..!

అమెరికా సైన్యంలో ఆత్మహత్యలు పెరిపోతున్నాయి. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లోనే దాదాపు 88మంది సైనికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పెంటగాన్ ప్రకటించింది.

పెంటగాన్ ప్రకటించిన లెక్కల ప్రకారం జనవరినుంచి జూన్ నెల వరకు దాదాపు 88మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అదే గత ఏడాది ఇదే కాలానికి కేవలం 67మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని పెంటగాన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అమెరికాకు చెందిన ప్రధాన సైన్యాధికారి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ... నిరుడుకన్నాకూడా ప్రస్తుత ఏడాది సైనికులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని,

ఇది గత ఏడాదికంటే ఎక్కువగానే ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గత సంవత్సరం 128మంది సైనికులు ఆత్మహత్య చేసుకోగా అదే 2007లో ఈ సంఖ్య 115గా ఉండిందని ఆయన తెలిపారు.

ప్రస్తుత ఏడాది ఆత్మహత్యలకు పాల్పడ్డ 88మంది గురించి విచారణ పూర్తయ్యిందని అదే 34మంది గురించి ఇంకా విచారణ చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి