అమెరికాలో లిబర్టి విగ్రహం పునఃప్రారంభం

అమెరికాలోని న్యూయార్క్‌ ప్రాంతంలోనున్వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యుటీసీ) టవర్స్‌‌ను గత 2001వ సంవత్సరం సెప్టెంబరు 11వ తేదీన అల్ ఖైదా తీవ్రవాదులు విమానాలతో దాడి చేసిన విషయం తెల్సిందే. ఆ సంఘటన జరిగిన తర్వాత మూసివేసిన లిబర్టి విగ్రహాన్ని అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మళ్లీ ప్రారంభించారు.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని వీక్షించేందుకు సందర్శకులను అనుమతించారు.

మూడేళ్ల తర్వాత ప్రారంభమైన ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా సందడి, సందడిగా మారింది.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి