ఆస్తికోసమే జాక్సన్‌ హత్య: లాటోయా

ఎనిమిది వేలకోట్ల ఆస్తి కోసమే తన సోదరుడు, ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మైఖేల్‌ జాక్సన్‌ను హత్య చేశారని ఆయన సోదరి లాటోయా జాక్సన్ ఆరోపించారు.

మైఖేల్ జాక్సన్‌ది సహజ మరణం కాదని, రూ.8వేల కోట్ల ఆస్తి కోసమే తన సోదరుడిని పొట్టను బెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. తన సోదరునివద్ద ఎంతటి క్లిష్టమైన సమయంలోనైనా అతనివద్ద డబ్బులుంటాయని, కేవలం డబ్బులకోసమే అతనికి అతి ప్రమాదకరమైన మందులు ఇచ్చివుంటరాని ఆమె ఆరోపించారు.

తన సోదరుని మరణ వార్త విన్న వెంటనే తాము అతని ఇంటికి చేరుకున్నామని, ఆలోపలే అతనివద్ద ఉండవలని విలువైన వస్తువులు, డబ్బు మాయం అయ్యిందని ఆమె పేర్కొన్నారు. దీంతోపాటు అతని తల్లిదండ్రులుకూడా ఇదే విషయాన్ని టైమ్ మ్యాగజైన్‌కు వెల్లడించారు.

ఇదిలావుండగా జాక్సన్‌ చనిపోయేముందు అతనికి ప్రమాదకర స్థాయిలో మందులు ఇచ్చారని, వీటి వల్లే ఆయన చనిపోయారని సన్‌ పత్రిక ఇప్పటికే వెల్లడించింది.

కాగా జాక్సన్‌ మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలపై జరిపిన టాక్సికాలజి పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్లు ది సన్‌ పత్రిక తెలిపింది. ఈ విషయాన్ని లేవనెత్తుతూ... ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి