ఇరాక్‌లో మరోసారి బాంబు పేలుళ్ళు జరిగాయి. ఉత్తర ఇరాక్‌లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 20మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఇరాక్‌లోని మోసుల్ రాష్ట్రం తాల్ అఫర్, సదర్ సిటీల్లోని రద్దీ ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఆత్మాహుతి దళాలకు చెందిన ఇరువురు అక్కడికక్కడే తమను తాము పేల్చేసుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనల్లో దాదాపు 60మందికి పైగా తీవ్రగాయాలపాలైనారని వీరిని తక్షణమే వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని అధికారులు పేర్కొన్నారు.