చైనా ఘర్షణలకు ఆస్ట్రేలియాలో నిరసన

చైనాలో జరుగుతున్న జాతి వైషమ్యాలను నిరసిస్తూ ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో దాదాపు రెండు వందలమంది నిరసన కార్యక్రమం నిర్వహించారు.

చైనాదేశంలోని జింజియాంగ్ ప్రాంతంలో జాతి విద్వేషాలకు దాదాపు 156మంది బలైపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు నిరసనగా అక్కడి పార్లమెంట్ ప్రాంగణం ముందు గుమికూడిన ప్రజలు చైనా రాయబారి కార్యాలయానికి పాదయాత్ర నిర్వహించారు.

నిరసనకారులకు అధ్యక్షత వహించిన ఆస్ట్రేలియా యుగర్ సంస్థ నాయకుడు మాట్ హసన్ మాట్లాడుతూ... చైనా ఉగ్రవాదులను అంతమొందించి యుగర్ ప్రజలను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చైనాలోనున్న ముస్లిం కమ్యునిటిపై దాడులను తాము ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి