చైనాలోని జిన్‌జియాంగ్‌లో చెలరేగిన మత ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ కలహాల్లో 184 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయాల పాలైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో యుగర్లు, హన్ చైనీయులకు మధ్య చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటి వరకు 184మంతి మృతి చెందినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటకి అక్కడ తిరిగి మత ఘర్షణలు చెలరేగవచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున భద్రతా దళాలను మొహరింపచేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.