జపాన్‌లో ముందస్తు ఎన్నికలు..!

జపాన్ దేశంలో అక్టోబరులో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ముందుగానే జరపాలని ఆ దేశ ప్రధానమంత్రి తారో ఓసో నిర్ణయించారు.

ప్రస్తుతం ఆ దేశంలో అతనిపై, అతని నాయకత్వంపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకుగాను ఓసో ముందస్తు ఎన్నికలకు సిద్ధమౌతున్నట్లు జపాన్‌కు చెందిన క్యోదో వార్తా ఏజెన్సీ తెలిపింది.

దిగువ సభను రద్దు చేయాలని తాను భావిస్తున్నట్లు ఓసో తమపార్టీకి చెందిన ప్రముఖ సభ్యులతో అన్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలు ఆగస్టునెల ఎనిమిదవ తేదీన ఉండొచ్చని ఆ వార్తా సంస్థ ప్రకటించింది. భవిష్యత్ ప్రణాళికలను సోమవారం ప్రకటించనున్నట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది.

గత ఆదివారం టోక్యో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ)లోని సభ్యులందరు ఓసోను పదవీత్యాగం చేయాలని అతనిపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వచ్చారు. టోక్యోలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీ అయిన డెమొక్రటిక్ పార్టీ దాదాపు అన్ని సీట్లను గెలుచుకుంది.

ఇదిలావుండగా తాను తొలినుంచి నిర్ణయాత్మకమైన చర్యలు చేపట్టాలని సూచిస్తూ వచ్చానని, అయినాకూడా అతనిలో ఎలాంటి మార్పు రాలేదని, ఆ కారణంగానే ప్రస్తుతం టోక్యోలో జరిగిన ఎన్నికలలో పార్టీ ఘోరపరాజయం చవిచూసిందని ఎల్‌డీపీ ప్రధానకార్యదర్శి హాయదేనావో నాకాగావా తెలిపారు.

కాగా తమ పార్టీ మళ్ళీ ఓసో నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీ పడితే ఖచ్చితంగా ఓటమి ఖాయమని ఎల్‌డీపీ కార్యవర్గ సభ్యులు నోబుతేరు ఇషిహారా తెలిపారు. కాని దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరపాలనేది ప్రధాని ఓసోపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి