జాక్సన్ బిడ్డకు తండ్రిని నేను కాదు: మాల్నిక్

జాక్సన్ సంతానమైన ప్రిన్స్ మైఖేల్-2కి శాస్త్రీయ తండ్రి మైఖేల్ స్నేహితుడని ఇటీవల వచ్చిన వార్తలను ఆయన చిరకాల మిత్రుడు ఖండించారు.

చిన్నప్పట్నుంచీ ప్రిన్స్ మైఖేల్ ఆలనాపాలనా చూసుకుంటూ వస్తోన్న దివంగత జాక్సన్ స్నేహితుడు అల్ మాల్నిక్ మాట్లాడుతూ, బిడ్డకోసం తను వీర్యాన్ని దానం చేసినట్లు కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలలో నిజం లేదన్నారు. అయితే వీర్యదానం నిజమేననీ, కానీ ఆ దాత ఎవరో తెలీదని పేర్కొన్నాడు.

అసలు ప్రిన్స్ మైఖేల్‌కి రెండేళ్ల వయసు వచ్చేవరకూ అతడిని తాను చూడనే లేదన్నాడు. వాస్తవం ఇలా ఉంటే కొన్ని పత్రికలు మాత్రం అతడికి శాస్త్రీయ తండ్రిని తానని ప్రచురించడాన్ని చూసి విస్తుపోయానన్నాడు.

వెబ్దునియా పై చదవండి