ప్రత్యేకంగా భేటీ అయిన మన్మోహన్, ఒబామా

జీ-8 మరియు జీ-5 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా వివిధ దేశాధినేతలు సమావేశమైన సందర్భంగా భారత ప్రధాని మన్మోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

విదేశీ మంత్రిత్వశాఖాధికారుల సమాచారం మేరకు వారిరువురి భేటి స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగిందని తెలిపారు. ఇరుదేశాధినేతలు ప్రధాన అంశాలపై చర్చించారని, ద్వైపాక్షిక సంబంధాలపైకూడా చర్చించుకున్నట్లు సమాచారం.

జీ-8 మరియు జీ-5 శిఖరాగ్ర సమావేశాలకు వచ్చిన పలు దేశాధినేతలతో సమావేశమైనప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రత్యేకంగా వచ్చి భారతప్రధానిని దగ్గరకు తీసుకుని పక్కగా వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు.

వారు ప్రధానంగా వాతావరణ పరిస్థితులు, ఆర్థికమాంద్యం మరియు ఉగ్రవాదంపై అలాగే ద్వైపాక్షిక అంశాలపైకూడా చర్చించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలావుండగా వచ్చే వారం అమెరికా విదేశాంగశాఖమంత్రి హిల్లరీ క్లింటన్ భారత పర్యటనకు రానున్నారు.

కాగా ప్రస్తుత ఏడాది జనవరినెలలో అమెరికా అధ్యక్షునిగా ఒబామా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా తరపున అధికారికంగా భారత పర్యట చేస్తున్న తొలి వ్యక్తి హిల్లరీ కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి