బ్రిటీష్ ఎయిర్‌లైన్స్‌లో మంటలు

వాషింగ్‌టన్‌లోని ఫోనిక్స్ ఎయిర్ పోర్టులో బ్రిటీష్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్...747విమానంలో ఒక్క ఉదుటన మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు.

బోయింగ్ విమానంలో మంటలు చెలరేగడంతో విమానాశ్రయ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఇందులోనున్న ప్రయాణీకులు పెద్ద ప్రమాదంనుంచి బయట పడ్డారు.

ఇదిలావుండగా ప్రమాదం జరిగినప్పుడు విమానంలో మొత్తం 298మంది ప్రయాణీకులున్నట్లు విమానాశ్రయా వర్గాలు వెల్లడించాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వెబ్దునియా పై చదవండి