అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా మరియు ఆయన కుటుంబ సభ్యులు తన చారిత్రాత్మకమైన పర్యటనలో బాగంగా పశ్చిమాఫ్రికాలో పర్యటించారు. అక్కడకు చేరుకున్న ఆయన బానిసలను అమ్మే కోటను చూసి ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా కేప్ కోస్ట్‌లోనున్నటువంటి కోటనుంచి లెక్కలేనంతమంది బానిసలను అట్లాంటిక్ మహాసముద్రంనుంచి అమెరికా మహాద్వీపంకు చేరవేసేవారని ఒబామా తన పిల్లలుకు వివరించారు.
ఒబామా స్వయంగా ఆఫ్రికానుంచి అమెరికా తరలి వచ్చిన ఓ బానిసుని కొడుకు. ఈ పర్యటన సందర్భంగా అతనితోపాటు అతని భార్య, ఇద్దరు కుమార్తెలుకూడా ఆయన వెంట ఉన్నారు.
రాజధాని అక్రాకు పశ్చిమంగా 160 కిలోమీటర్ల దూరంలో ఈ కోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో బానిసలను అమ్మేముందు గృహ నిర్మాణాలకు వాడే కలప మరియు బంగారం వ్యాపారం జరిగేదని ఆయన తన పిల్లలకు వివరించారు. ఇలాంటి చారిత్రాత్మకమైన కోటను చూసి ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులుకూడా భావోద్వేగానికి లోనయ్యారు.