ప్రపంచ పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 50 సంవత్సరాల జాక్సన్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే.
వీటిపై నివృత్తి చేయడానికి ఆయన మెదడును (న్యూరోపాథాలజీ) నాడీ సంబంధమైన చికిత్సలు జరుపుతారని డైలీ మిర్రర్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దీన్ని లాస్ఏంజెల్స్ దుర్మరణ విచారణాధికారి ధృవపరిచారు. జాక్సన్ మెదడును తీసి శరీరాన్ని ఆయన బంధువులకు గత మంగళవారం అప్పగించామని చెప్పారు.
ఇప్పటి వరకు ఆయన మెదడుకు పరీక్షలు మెదలు పెట్టలేదని, కొద్ది రోజుల ఆగితే మెదడు గట్టి పడుతుందని, అప్పుడు మెదడు తెరిచేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశామని, వారు మెదడు లేకుండా ఖననం చేసేందుకు ఒప్పుకున్నారని ఆయన వివరించారు.