లాడెన్ ఆఫ్గనిస్థాన్‌లోనే ‌: పాక్‌ మంత్రి

ఒసామా బిన్‌లాడెన్‌తో సహా అల్‌ ఖైదా అగ్ర నేతలంతా అఫ్గనిస్థాన్‌లోనే ఉన్నారని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ అన్నారు. పాక్‌లో లాడెన్‌ ఉండే ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.

తాము ఇప్పటికే పాకిస్థాన్‌లోని అల్‌ ఖైదా నాయకుల కోసం మా భద్రతా దళాలతో తూర్పార పట్టాం, కాని వారి జాడ కానరాలేదని ఆయన తెలిపారు.

అల్‌ ఖైదా నాయకులు లాడెన్‌తోపాటు ఇతర అగ్రనేతలందరూ అఫ్గనిస్థాన్‌ నుంచే తమ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

బహుశా వారు కునార్‌ ప్రాంతంలో ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అక్కడకు చేరుకునేందుకు తమ భద్రతా దళాలు మార్గాలను అన్వేషిస్తున్నాయని పాక్‌లోనే లాడెన్‌ ఉన్నాడని స్వాత్‌లోయలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో అధికంగా సాధారణ పౌరులు చనిపోతున్నారని మాలిక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి