ఐపీఎల్ 2018 పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. తొలత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు ఉండగానే విజయం సాధించింది.
కెప్టెన్ దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 4 ఫోర్లతో 35 నాటౌట్)తో పాటు పించ్ హిట్టర్ సునీల్ నరైన్ (19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 50) తుఫాన్ ఇన్నింగ్స్ సహాయంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది.
డివిల్లీర్స్ (23 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 44), మెకల్లమ్ (27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) రాణించగా చివర్లో మన్‌దీప్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) చెలరేగాడు. రాణా, వినయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది. నితిష్ రాణా (25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) ఆకట్టుకున్నాడు. వోక్స్‌కు 3, ఉమేశ్‌కు 2వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్‌కి దక్కింది.