వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఉన్నవారు జూన్ 30, 2021 వరకు దీనిని వినియోగించుకోవాలని అమేజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఈ సంస్థ ఉద్యోగుల్లో 19,000 మందికి కోవిడ్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పరిశీలకులు అంటున్నారు. కరోనా కాలంలో కూడా గోదాములను తీసి ఉద్యోగులను ప్రమాదంలోకి నెట్టిందని అమేజాన్‌పై విమర్శలు వెలువడ్డాయి.
కోవిడ్ వ్యాప్తి కారణంగా వర్క్‌ఫ్రం హోమ్ చేస్తున్న తమ ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. దాదాపుగా ఏడు నెలల నుంచి గూగుల్ సంస్థ కూడా తమ సిబ్బందికి 'వర్క్ ఫ్రమ్ హోం' అవకాశాన్ని కల్పించింది. కోకోకోలా, స్క్వేర్ తదితర ప్రముఖ సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.