యాపిల్ యాప్ స్టోర్ ధరలు భారీగా పెరిగిందట.. భారత్-యూకే-టర్కీల్లో?

బుధవారం, 18 జనవరి 2017 (12:15 IST)
స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ తన యాప్ స్టోర్ ధరలను భారీగా పెంచింది. భారత్‌తో పాటు యూకే, టర్కీలోని యాప్ స్టోర్‌లో రుసుంను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. అలాగే దీనికి సంబంధించిన ఔఓఎస్ యాప్ డెవలపర్లకు ఈ-మెయిల్స్ పంపింది. భారత్‌.. టర్కీ యాప్‌ స్టోర్లలోనూ ధరలు పెంచింది. భారత్‌లో సేవా పన్నులు పెరగడంతో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టర్కీ కరెన్సీ 'లిరా' విలువ కూడా భారీగా కుదేలవడంతో టర్కీలోనూ యాప్‌ స్టోర్‌ ధరలు పెంచింది. 
 
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు జరిగిన బ్రెగ్జిట్ రెఫరెండం ఎన్నికల ప్రభావంతో బ్రిటిష్‌ పౌండ్‌ విలువ భారీగా పతనమైంది. డాలర్‌తో పోల్చితే పౌండ్‌ దాదాపు 18.5 శాతం నష్టపోయింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు యాప్‌ స్టోర్‌ టారిఫ్‌లు పెంచుతున్నట్లు యాపిల్‌ తెలిపింది. ఇప్పటి వరకూ 0.79 పౌండ్‌ ఉంటే ఇకనుంచి 0.99 పౌండ్‌ చెల్లించాల్సి ఉంటుందట. అంటే దాదాపు 25శాతం పెరిగింది. పెంచిన ధరలు ఏడు రోజుల్లో అమల్లోకి వస్తాయని యాపిల్‌ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి