కోట్లాది ఫోన్ కాల్స్ కట్ అవుతున్నాయ్.. ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌పై జియో ఫిర్యాదు..

శుక్రవారం, 12 మే 2017 (15:50 IST)
ఉచిత డేటా పేరిట టెలికామ్ సంస్థలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం టెలికాం సంస్థలు చేసే లొసుగులను ఎత్తిచూపేందుకు సంసిద్ధమైంది. ఇందులో భాగంగా.. టెలికామ్ రంగంలో తమ హవాను అడ్డుకునే దిశగా.. అగ్ర సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ లతో పాటు సీఓఏఐ (సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రయత్నిస్తున్నాయని జియో ఫిర్యాదు చేసింది. 
 
జియో చేసిన ఫిర్యాదుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా ఉండటంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ మొదలెట్టింది. భారత టెలికామ్ రంగంలోని మూడు ప్రధాన సంస్థలు పోటీ తత్వాన్ని చూపకుండా.. జియోపై అభాండాలు వేస్తూ.. తన అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని జియో చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 
 
అంతేగాకుండా సంబంధిత కంపెనీలు జియోకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడమే కాకుండా.. తమ కస్టమర్లకు కనెక్టివిటీ పోర్టులను అందించడం లేదని, నిత్యమూ కోట్లాది ఫోన్ కాల్స్ గమ్యానికి చేరుకోవడం లేదని జియో ఆరోపించింది.

వెబ్దునియా పై చదవండి