ఐఫోన్ 17 సిరీస్ నుంచి లాంఛ్ కానున్న మొబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో సెప్టెంబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఈ ఫోన్లకి ఫీచర్స్ లీకవ్వడంతో ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ఏర్పడింది. ఐఫోన్ 17 ఎయిర్ బరువు సుమారు 145 గ్రాములు, మందం కేవలం 5.5 మిల్లీమీటర్లు మాత్రమేనని అంటున్నారు. ఇది గనుక నిజమైతే, ఇప్పటి వరకూ విడుదలైన ఐఫోన్‌ల్లో ఇది అత్యంత సన్నగా ఉండే ఫోన్ ఇదే అవుతుంది.