17 లక్షల ఖాతాలపై కొరడా ఝుళిపించిన వాట్సాప్

సోమవారం, 3 జనవరి 2022 (10:21 IST)
ఫేక్ న్యూస్ ప్రచారం, అశ్లీల సమాచారం వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించిన ఖాతాలపై చర్యలు తీసుకున్నట్టు వాట్సాప్ పేర్కొంది. ఈ మేరకు గత నవంబరు నెలలో భద్రతా నివేదిక రూపొందించినట్టు వాట్సాప్ పేర్కొంది. అలాగే వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన లక్షలాది ఖాతాలపై ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొరడా ఝుళిపించింది. 
 
17 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఇతర యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యూజర్లపై నిషేధం విధించడం ఇదేమీ కొత్తకాదు. గతేడాది అక్టోబరులో 20 లక్షల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసింది. తాము నిషేధించిన ఖాతాల్లో బల్క్, స్పామ్ సందేశాలు పంపేవి ఎక్కువగా ఉన్నాయని వాట్సాప్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు