వాట్సాప్ వినియోగదారులకు మరో అద్భుత ఫీచర్ 'స్నాప్‌చాట్'

ఆదివారం, 6 నవంబరు 2016 (13:36 IST)
వీడియో కాలింగ్ ఫీచర్‌తో వినియోగదారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన ‘వాట్సాప్’ మరోసరికొత్త ఫీచర్‌తో తమ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. కొత్తగా స్నాప్‌చాట్ వంటి ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులో తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్‌తో వినియోగదారులు ఫోటో, వీడియోలను తమకు కావాలసిన విధంగా ఎడిట్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. 
 
ఈ ఫీచర్ ద్వారా డూడుల్స్, ఇమేజెస్, టెక్ట్‌ని ఫోటోలపై ఆకర్షణగా ఉంచవచ్చు. వాట్సాప్‌లో ‘స్టేటస్’ అనే పేరుతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి రానుంది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఈ ఫీచర్ వాట్సాప్‌లోని చాట్, కాలింగ్‌ ఆప్సన్ల మధ్య కొత్త టాబ్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఈ ఫీచర్‌లో ఉన్న మరోముఖ్యమైన విశేషమేమిటంటే వీడియో తీసుకుని మనుకు ఎలాకావాలంటే అలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన ఫోటో లేదా వీడియో కేవలం 24 గంటలు మాత్రమే కనపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి