బుజ్జిమేక ఏడకెళ్లింది..?

బుధవారం, 29 అక్టోబరు 2008 (13:13 IST)
FileFILE
బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెళ్తివి?
రాణిగారి తోటలోన మేతకెళ్తిని..!

రాణిగారి తోటలోన ఏమి చేస్తివి?
రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని...!

పూల చెట్ల సొగసు చూసి ఊరకుంటివా..?
ఊరకొనక పూల చెట్ల మేసివస్తిని...!

మేసి వస్తే, తోటమాలి ఏమి చేసెను?
తోటమాలి కొట్టవస్తే తుర్రుమంటిని...!!!

వెబ్దునియా పై చదవండి