విద్యలేనివాడు విద్వాంసు..!

బుధవారం, 29 అక్టోబరు 2008 (13:08 IST)
FileFILE
విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు గాడు
కొలని హంసలకడ గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ... వినుర వేమ...!

తాత్పర్యం :
అందమైన హంసలతో కలిసి, తిరుగాడినంత మాత్రాన కొంగ, హంస కాలేదు. అదేవిధంగా... సరైన విద్యాబుద్ధులు నేర్వనివాడు, సకల విద్యలూ తెలిసిన పండితుడివద్ద ఉన్నప్పటికీ ఎప్పటికీ పండితుడు కాలేడు. కాబట్టి, ప్రతి ఒక్కరికీ చదువు అనేది చాలా ముఖ్యమని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి