"నేను మీ చౌకీదారుని" అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి శుభలేఖలను కూడా బీజేపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించారు.
పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ విడుదల చేసిన బొట్ట బిళ్లల ప్యాకెట్‌పై ఒకవైపు నరేంద్రమోడీ, మరోవైపు బీజేపీ కమలం గుర్తు ముద్రించి ఉన్నాయి. పైభాగంలో హిందీలో ఫిర్ సే మోదీ సర్కార్ (మరోసారి మోడీ ప్రభుత్వం) అని రాసి ఉంది. ఈ ఫోటోలను పశ్చమ బెంగాల్ రాయ్‌గంజ్ నియోజకవర్గ ఎంపీ అయిన సలీం ట్విట్టర్లో పోస్ట్ చేశారు.