ఆ నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవాలి : ఇస్రో మాజీ చీఫ్

ఎస్ బ్యాండు కేటాయింపుల్లో భాగంగా... ఆంత్రిక్స్-దేవాస్ మధ్య కుదిరిన ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నలుగురు స్పేస్ శాస్త్రవేత్తలపై చర్యలు తీసుకొనే ముందు ప్రభుత్వం వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా చర్యలు తోసుకోవటం హాస్యాస్పదంగా ఉందని ఇస్రో మాజీ ఛీఫ్ ప్రొఫెసర్ యు.ఆర్‌.రావు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ప్రజాస్వామ్యం నవ్వులపాలైందని, మనం ఏ రకమైన ప్రజాస్వామ్యంలో నడుస్తామని ప్రశ్నించారు.

ఈ విషయంలో వారిపై నమోదైన అభియోగాలు నిరూపిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని, కానీ వారి వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ ఒప్పందం ఇస్రో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణలపై ఇస్రో మాజీ ఛీఫ్ ప్రొఫెసర్ మాధవన్ నాయర్‌తో పాటు నలుగురు శాస్త్రవేత్తలపై ఇస్రో చర్య తీసుకున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి