ఢిల్లీలో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఢిల్లీలో ఓ యువతిపై స్నేహితుడే కాల్పులు జరిపాడు. అదీ ఆమె ఇంటి ముందే ఈ ఘోరం జరిగిపోయింది. బుల్లెట్ శబ్దంవిని బయటకు పరుగెత్తుకు వచ్చిన తల్లికి రక్తపు మడుగులో ఉన్న కూతురు కనిపించింది. ఢిల్లీలోని నజఫ్ ఘడ్‌కు చెందిన ఓ యువతి యోగేష్, శుభమ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది.
కారు నుంచి దిగి యోగేష్‌తో యువతి మాట్లాడుతుండగానే, కారులో కూర్చున్న శుభమ్ అనే వ్యక్తి యువతిపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా.. ఇంటికి వచ్చేసిందనుకున్న కుమార్తె కాల్పులకు గురైందని తెలిసి.. ఆ తల్లి బోరున విలపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.