అన్నాడీఎంకే అధినేత, దివంగత సీఎం జయలలిత మరణ వార్త విని తట్టుకోలేక మొత్తం 597 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం ప్రకటించింది. అమ్మ అనారోగ్యం, మరణ వార్తలను విని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబీకులకు సానుభూతి తెలుపుతూ.. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు చొప్పున కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు అన్నాడీఎంకే పేర్కొంది.
డిసెంబర్ 11వరకూ జయలలిత మరణవార్త కారణంగా చనిపోయిన 470 కుటుంబాలకు ఏఐఏడీఎంకే పరిహారం ప్రకటించింది. మొదట 280 మందికి మాత్రమే ప్రకటించిన పార్టీ తరువాత మరో 190 మందికి కూడా ప్రకటించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మరో 127 మరణాలు నమోదు కావడంతో పరిహారం చెల్లించాల్సిన మొత్తం కుటుంబాల సంఖ్య 597కు చేరినట్లు అన్నాడీఎంకే పార్టీ తెలిపింది.