కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

ఠాగూర్

సోమవారం, 5 మే 2025 (18:48 IST)
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత, నీలగిరి లోక్‌సభ సభ్యుడు ఏ.రాజా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఓ సభలో పాల్గొని ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి పోడియంపై పడింది. దీన్ని గమనించిన ఏ.రాజా రెప్పపాటులో పరుగెత్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార డీఎంకే సమాయత్తమవుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, తాజాగా మైలాడుదురైలో ఆదివారం రాత్రి ఎన్నికల సభను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. 
 
ఈ సభలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలి దుమారం చెలరేగింది. ఆ ధాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది. అయితే, దాన్ని గమనించిన ఎంపీ రాజా వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయన పెను ప్రమాదం తప్పింది. 

 

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలిదుమారం మొదలైంది...

ఆ ధాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది... అయితే ఇది గమనించిన ఎంపీ వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది... pic.twitter.com/cWQE0Z6kAM

— Telangana Awaaz (@telanganaawaaz) May 5, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు