పుణ్యభూమిగా భాసిల్లే ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రిషికేశ్ (Rishikesh)లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆపివున్న స్కూటర్‌ను ఎద్దు ఒకటి రైడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ, ముక్కున వేలేసుకుంటున్నారు.
అంతటితో ఆగకుండా తన కాళ్లతో స్కూటర్‌ను నెమ్మదిగా ముందుకు కదిలించింది. సాధారణంగా జంతువులు, ముఖ్యంగా పశువులు ఇలా వాహనాలపైకి ఎక్కడం లేదా వాటితో విన్యాసాలు చేయడం ఉండదు. కానీ, ఈ ఎద్దు ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై జరిగిన ఈ విచిత్ర సంఘటన తాలూకా వీడియో దృశ్యాలు ఇపుడు వెలుగులోకి రావడంతో అవి వైరల్ అయ్యాయి.