దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. రెండో స్థానంలో వరకట్నపు చావులు, హత్యలు ఉన్నాయి. మహిళలపై అత్యధికంగా నేరాలకు పాల్పడుతున్నది యువతేనని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది.
సమాజంలో మహిళకు సమాన హక్కులు ఏమో గానీ స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా పొందలేకపోతోంది. తనను రక్షించుకునే పరిస్థితిలో లేని మహిళ నిస్సహాయంగా మిగులుతోంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధిక శాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఇవే 59.3 శాతం ఉండగా.. వరకట్నపు చావులు, హత్యలు రెండో స్థానంలో ఉన్నాయి.
భారత శిక్షాస్మృతి కింద 2017లో దేశం మొత్తం 1,21,997 మందికి శిక్షపడితే అందులో మహిళలపై నేరాలకు పాల్పడినవారు 18,165 మంది ఉన్నారని జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. నివేదిక ప్రకారం.. ఇందులో అత్యాచార కేసుల్లో శిక్ష పడినవారు 10,892 మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహబూబ్నగర్ జిల్లాలో 17 రోజుల్లో 13 అఘాయిత్యాలు!
దిశ ఎన్కౌంటర్ తర్వాత ఏమైన మేలుకొన్నామా? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే గత 17 రోజుల్లో మళ్లీ 13 అఘాయిత్యాలు జరిగాయి. అసలు సమాజం ఎటు పోతుంది. ఎందుకీ ఇన్ని దారుణాలు? దిశ దుర్ఘటన యావద్దేశాన్ని కదిలించింది.